551
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా నిర్వహించనున్నది. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు.
ఈ మహాసభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ లావు కృషి చేస్తున్నారు.
ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హీరోయిన్ శ్రీలీల వచ్చినప్పుడు ఆమెకు తానా నాయకులు ఘన స్వాగతం పలికారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, జగదీశ్ ప్రభల ఇతరులు ఆమెను స్వాగతించారు.