నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు..
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కొరియోగ్రఫీ : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.
నిడివి: 2 గంటల 45 నిమిషాలు
రేటింగ్: 2.75/5
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చింది ఖుషి. ఆ సినిమాలు చూస్తే ఖుషిలో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది. అతని కథలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈసారి తన కథకు మరింత డ్రామా యాడ్ చేశాడు శివ నిర్వాణ.
ఊహించినట్లుగానే, ఖుషి కథ స్టార్ట్ అవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ చేశాడు దర్శకుడు. దాని కోసం కశ్మీర్ లో ల్యాండ్ అయ్యాడు. ఏదైనా రొమాంటిక్ ట్రాక్ క్లిక్ అవ్వాలంటే, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ముఖ్యం. ఈ సినిమాలో ఆ సమస్య లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు కూడా ఈ కెమిస్ట్రీని మరింత స్పైసీగా మార్చాయి. ఎటొచ్చి సన్నివేశాలతోనే సమస్య వచ్చింది.
శివ నిర్వాణ రాసుకున్న సన్నివేశాల్లో మేజిక్ లేదు. హీరోహీరోయిన్లు ఎంత రొమాంటిక్ గా కనిపించినా, సన్నివేశం రొటీన్ అనిపిస్తుంది. దీనికితోడు రొమాంటిక్ ట్రాక్ చాలా లెంగ్తీగా ఉంది. ఓ దశ తర్వాత అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమాలో కాన్ ఫ్లిక్స్ పాయింట్ వేరే ఉందని, ఇది ప్రేమకథ కాదని ముందే ఆడియన్స్ కు తెలుసు. ట్రయిలర్ లో ఆ లీడ్స్ ఉన్నాయి. దీంతో రొమాంటిక్ ట్రాక్ దాటి కథ ఎప్పుడు ముందుకెళ్తుందా అని ప్రేక్షకుడు వెయిట్ చేస్తుంటాడు.
ప్రధాన జంట వారి గమ్యస్థానానికి తిరిగొచ్చి, వాళ్ల తల్లిదండ్రులను కలుసుకున్న తర్వాత, కథ వేగంగా కదులుతుందని, కాన్ ఫ్లిక్స్ బయటపడుతుందని, అప్పుడు ఇంటర్వెల్ పడుతుందని అంతా ఊహిస్తారు. కానీ ఈ ప్రయాణం కూడా నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమా మొత్తం చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా చాలా పొడవు ఉంది. స్క్రీన్ ప్లే ఊహించుకునేలా ఉండడంతో ల్యాగ్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. అయితే మంచి సంగీతం, ఫస్టాఫ్ లో కామెడీ, కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు ఖుషీని ఓసారి చూడొచ్చు అనిపించేలా చేస్తాయి.
సినిమాకు మరో ప్లస్ పాయింట్ విజయ్ దేవరకొండ-సమం కెమిస్ట్రీ. వీళ్లిద్దరూ ఫస్ట్ హాఫ్ ను అద్భుతంగా నడిపించారు. సమంతను విజయ్ ట్రై చేయడం, సమంత లుక్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ రాకతో సినిమా మరో టర్న్ తీసుకుంటుంది. విజయ్ దేవరకొండ ఎక్కడా గాడి తప్పలేదు. అతడి యాక్టింగ్ పెర్ ఫెక్ట్ గా ఉంది. ఇక సమంత కూడా చాలా బ్యాలెన్స్ డ్ గా చేసింది. ఎక్కడా ఎక్కువ చేసినట్టు అనిపించలేదు. అయితే ఇద్దరూ గొడవపడే కొన్ని సందర్భాల్లో మాత్రం సహజత్వం లోపించింది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రోహిణి, మురళీశర్మ.. తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ గా సినిమా హై-లెవెల్ లో ఉంది. ముందుగా చెప్పుకోవాల్సింది హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ గురించే. తమ పాటలతో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు హేషమ్. అతడి సంగీతం చాలా ఫ్రెష్ గా ఉంది. ఆ సంగీతానికి మురళి అందించిన సినిమాటోగ్రఫీ పెర్ ఫెక్ట్ గా సింక్ అయింది. ఎడిటర్ ప్రవీణ్ పూడి వర్క్ పై కంప్లయింట్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. దర్శకుడిగా శివ నిర్వాణ తమ బలం ఏంటనేది మరోసారి చూపించాడు. ఈసారి అతడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. చాలా చోట్ల రొటీన్ సన్నివేశాలు రాసుకున్నాడు. అన్నట్టు ఈ సినిమాకు పాటల రచయిత, కొరియోగ్రాఫర్ కూడా ఇతడే. ఇలా చాలా విభాగాల్ని హ్యాండిల్ చేసిన శివ నిర్వాణ అన్నీ తానై ఖుషి సినిమాను ముందుకు నడిపించాడు.
ఓవరాల్ గా ఖుషి సినిమాలో నిడివి సమస్యలున్నప్పటికీ విజయ్ దేవరకొండ యాక్టింగ్, హేషమ్ మ్యూజిక్ కోసం ఈ సినిమాను తప్పనిసరిగా ఓసారి చూడొచ్చు. సమంత బోనస్ అనుకోవాలి.