వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. భీకర హిట్టర్లతో కూడిన ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధిస్తుందని భావించారంతా. కానీ న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. ఇంగ్లాండ్‌కు శుభారంభం లభించలేదు. మలన్‌ను హెన్నీ ఔట్ చేసి ఆదిలోనే దెబ్బతీశాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ బట్లర్‌తో కలిసి రూట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి అయిదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కివీస్ బౌలర్లు దెబ్బతీశారు.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 77 పరుగులు, జాస్ బట్లర్ 43, బెయిర్‌స్టో 33, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లు, శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ఆరంభ మ్యాచ్‌లో స్టేడియంలో సీట్లన్ని ఖాళీగా కనిపించాయి. 50 ఓవర్ల మ్యాచ్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో వీక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.