అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్.. చరిత్రలో నిలిచిపోయే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ఆదుకొని విజయతీరాలకు చేర్చాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాక్సీకి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ దశలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న అందరికీ ఓ డౌట్ వచ్చి ఉంటుంది. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న మాక్సీ బైరన్నర్‌ను ఎందుకు పెట్టుకోలేదని! అయితే బైరన్నర్‌ను సాయంగా తీసుకొనే అవకాశం లేకుండా ఐసీసీ 2011లోనే నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు ఇబ్బందిగా మారుతుందనే విజ్ఞప్తుల మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే దేశవాళీ, ఇతర లీగ్‌ల్లో మాత్రం యథావిధిగా బై-రన్నర్స్‌ను పెట్టుకొనే వెసులుబాటును కల్పించింది. అందుకే మ్యాక్స్‌వెల్ నొప్పితో బాధపడినా బైరన్నర్ సాయం లేకుండా ఆడాల్సి వచ్చింది.
367
previous post