gill
Home » వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లదే హవా

వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లదే హవా

by admin
0 comment

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లదే హవా. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మన ఆటగాళ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ను వెనక్కినెట్టి బ్యాటింగ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకపై 92, దక్షిణాఫ్రికాపై 23 పరుగులు చేసిన గిల్‌ తన రేటింగ్స్‌ పాయింట్స్‌ను మెరుగుపరుచుకొని టాప్‌ ర్యాంక్‌కు చేరాడు. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ను సాధించిన నాలుగో భారత ఆటగాడిగా గిల్‌ రికార్డులకెక్కాడు. సచిన్‌ టెండుల్కర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి గతంలో అగ్రస్థానంలో కొనసాగారు. ప్రస్తుత బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో గిల్‌తో పాటు కోహ్లి, రోహిత్ శర్మ కూడా నిలిచారు. కోహ్లి 4వ ర్యాంక్‌లో, రోహిత్‌ శర్మ 6 స్థానంలో ఉన్నాడు. మరోవైపు బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ సిరాజ్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్ 4, బుమ్రా 8, షమి 10వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links