స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బర్త్‌డే ఈ రోజు. ఆదివారం తన 35వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అయితే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో విరాట్ ఫ్యాన్స్.. కింగ్ కోహ్లికి వినూత్నంగా స్టేడియానికి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు కోహ్లి వన్డేల్లో 48 సెంచరీలు సాధించాడు. ఆ 48 సెంచరీల కోహ్లి సెలబ్రేషన్స్ ఫొటోలను కటౌట్ల రూపంలో స్టేడియం బయట ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను కోహ్లి అభిమానులు నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. మరోవైపు కోహ్లి 49వ సెంచరీ సాధిస్తే.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా నిలిచిన సచిన్ రికార్డును సమం చేస్తాడు. అయితే వన్డేల్లో కోహ్లి తన తొలి శతకాన్ని ఈడెన్‌గార్డెన్‌లోనే కావడం విశేషం. మరి చరిత్ర కూడా ఈడెన్‌లోనే సృష్టిస్తాడో లేదో చూడాలి!
251
previous post