అఫ్గానిస్థాన్‌పై డబుల్ సెంచరీ బాది ఆస్ట్రేలియాను మాక్స్‌వెల్ విజయతీరాలకు చేర్చాడు. క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మాక్సీ 2019లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నాని చెప్పి, ఆట నుంచి సడెన్‌గా విరామం ప్రకటించాడు. సీన్‌కట్ చేస్తే.. రీఎంట్రీ తర్వాత ఆసీస్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. అయితే మాక్సీ తన సమస్యలను అధిగమించడానికి కారణం తన భార్య వినీ రామన్. ఫార్మసిస్ట్ అయిన వినీ మన భారత సంతతి. చెన్నైకు చెందిన వీళ్ల కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడింది. 2013లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసిన మాక్సీ-వినీ గతేడాది ఒక్కటయ్యారు. అయితే మాక్సీ సమస్యను గుర్తించిన వినీ… క్లిష్ట సమయంలో అతనికి అండగా నిలిచి ప్రోత్సహించింది. ‘ఫామ్ కోల్పోయినా.. మానసికంగా కుంగిపోయినా తిరిగి కోలుకొని నిరూపించుకోగలగడంలో వినీ పాత్ర కీలక’మని మ్యాక్సీ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు.
386
previous post