Vande Bharat
Home » Vande Bharat Express: నేడు ఆ మార్గంలో వందేభారత్‌ రద్దు

Vande Bharat Express: నేడు ఆ మార్గంలో వందేభారత్‌ రద్దు

by admin
0 comment

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నేడు రద్దయింది. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రయాణికులకు చేరవేశామని తెలిపింది.

టికెట్‌ రద్దు చేసుకుంటే 100% మొత్తాన్ని రీఫండ్‌ చేస్తామని వెల్లడించింది. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రైలులో ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు టికెట్‌ ధరలో ఉన్న వ్యత్సాసం మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది. వందేభారత్‌లో ఉండే విధంగానే ఈ రైలులోనూ క్యాటరింగ్‌ సదుపాయం ఉంటుందని వెల్లడించింది.

మరోవైపు విశాఖపట్నం నుంచి సికింద్రబాద్‌కు వెళ్లాల్సిన వందేభారత్‌ను కూడా రద్దు చేశారు. ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును కూడా సాంకేతిక కారణాలతో రద్దు చేశారు. దాని స్థానంలో 7 గంటలకు ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేశారు. వందేభారత్‌ స్టాపుల్లోనే ప్రత్యామ్నాయ రైలు ఆగుతుందని తెలిపారు. అయితే వందేభారత్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links