433
వన్డే వరల్డ్ కప్‌లో ఆద్యంతం సత్తాచాటిన టీమిండియా ఆఖరి మెట్టుపై తడబడి ట్రోఫీని చేజార్చుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం మైదానాన్ని వీడుతున్న క్షణంలో టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. నిరాశలో కూరుకుపోయిన భారత జట్టు ఆటగాళ్లను ఓదార్చారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన స్టార్ పేసర్ మహ్మద్ షమిని హత్తుకుని మోదీ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, షమి తన ట్విటర్లో పంచుకున్నారు. కాగా, సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్లు టీమిండియాకు మద్దతుగా నిలుస్తున్నారు.