flag
Home » IndianFlag: మువ్వన్నెల పతాక చరిత్ర

IndianFlag: మువ్వన్నెల పతాక చరిత్ర

by admin
0 comment

స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎటూ చూసినా మువ్వన్నెల జెండానే కనిపిస్తోంది. ఇలా మనం స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి.. ఎన్నో వేలమంది సమరయోధుల బలిదానాలు ఉన్నాయి. ఆంగ్లేయులపై వారు చూపిన పరాక్రమంతో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే అప్పటి పోరాటమంతా ఒకే జాతీయ జెండా లేదు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జెండాను రూపకల్పన చేసుకుంటూ పోరాటం చేశారు.

జాతీయోద్యమంలో వందేమాతర ఉద్యమం ఎంతో కీలకం. బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తూ దేశ ప్రజలంతా ఏకమయ్యారు. అయితే ఈ పోరాట సమయమైన 1906లో గ్రీన్‌, ఎల్లో, రెడ్‌ రంగులతో పతాకాన్ని రూపకల్పన చేశారు. మధ్యలో ఉన్న ఎల్లో కలర్‌పై ‘వందేమాతరం’ అని రాసి ఉంటుంది. కింద ఉన్న రెడ్‌ కలర్‌లో నెల వంక, సూర్యుని చిహ్నాలు ఉంటాయి.

1907లో ఉన్న జాతీయ పతాకం అదే తరహాలో ఉంటుంది. కానీ రంగులు మార్చారు. కాషాయం, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో పతాకాన్ని తయారుచేశారు. మిడిల్‌లో ఉన్న ఎల్లోలో వందేమాతరం అని ఉంటుంది.

జాతీయోద్యమంలో మరో కీలక ఘట్టం హొంరూల్ ఉద్యమం. 1916లో అనిబిసెంట్, లోక్‌మాన్య బాలగంగాదర్‌ తిలక్‌ ఈ ఉద్యమాన్ని నడిపించారు. అయితే 1917లో వీరిద్దరు కొత్త జాతీయ పతాకంతో ఆంగ్లేయులపై తిరగబడ్డారు. ఈ జెండాలో ఆంగ్లేయుల పతాకం గుర్తును జతచేసి, రెడ్‌, గ్రీన్‌తో రూపకల్పించారు.

బ్రిటీష్‌కు వ్యతిరేకంగా సహాయనిరాకరోణద్యమం జరిగింది. దీనిలో భాగంగా 1921లో విజయవాడలో సభను నిర్వహించారు. ఈ సభలో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించగా, మహాత్మ గాంధీ ఆమోదించారు. వైట్‌, గ్రీన్‌, రెడ్‌ కలర్స్‌తో ఈ మువ్వన్నెల జెండా ఉంటుంది. మధ్యలో రాట్నం గుర్తును జతచేశారు. తెలుపు రంగు శాంతికి చిహ్నంగా, రాట్నం దేశ ఆర్థిక వ్యవస్థకు గుర్తుగా జెండాను రూపొందించారు.

ఆ తర్వాత 1931లో ‘కాంగ్రెస్‌ ఫ్లాగ్‌ కమిటీ’ పతాకాన్ని రీడిజైన్‌ చేసింది. జెండాలోని రంగులును మార్చి రాట్నంను కొనసాగించారు. ప్రస్తుత త్రివర్ణ పతాక రంగులు 1931లో మొదటిసారిగా జతచేశారు. స్వాత్రంత్యం వచ్చిన తర్వాత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో రాట్నం గుర్తు స్థానంలో అశోక చక్రాన్ని జత చేయడంతో ప్రస్తుత భారత జాతీయ జెండా అమల్లోకి వచ్చింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links