ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న ఫోన్లలో త్వరలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్ వాడుతున్న మొబైల్స్‌కు అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పనిచేయదు. ఏసర్ ఐకోనియా ట్యాబ్ A5003, మోటోరొలా ఫోన్లలో డ్రాయిడ్ రేజర్, జూమ్, ఆసుస్ E ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్, సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క్ 3, సోనీ ఎక్స్‌పీరియా Z, నెక్సస్ 7, శాంసంగ్ ఫోన్లలో గెలాక్సీ ట్యాబ్ 10.1, గెలాక్సీ ఎస్, గెలాక్సీ ఎస్2, గెలాక్సీ నెక్సస్, గెలాక్సీ నోట్ 2, HTC వన్, డిజైర్ HD సెన్సేషన్, LG ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ 2 ఎక్స్ ఫోన్లలో వాట్సాస్ సేవలు పనిచేయవు. మీ స్మార్ట్‌ఫోన్ OS వెర్షన్‌ను ఎలా తనిఖీ చేయాలంటే.. తొలుత మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో ఓపెన్ చేసి ఎబౌట్ ఫోన్ ఆప్షన్‌కు వెళ్లాలి. అందులో ఆండ్రాయిడ్ వెర్షన్ కనిపిస్తుంది.
1.6K