kohli
Home » అది.. కోహ్లి రేంజ్‌ – నో డిబేట్‌.. యునానిమస్

అది.. కోహ్లి రేంజ్‌ – నో డిబేట్‌.. యునానిమస్

by admin
0 comment

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ గ్రాండ్‌ ఇంట్రీ ఇవ్వనుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అధికారికంగా చేర్చారు. అప్పుడెప్పుడో 1900 ఒలింపిక్స్‌లో ఏదో నామమాత్రంగా ఓ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ మెగా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చలేదు. ఇప్పడు ఈ నిరీక్షణ ముగిసింది. అయితే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే సమయంలో విరాట్‌ కోహ్లి ప్రస్తావన వచ్చింది. లాస్‌ ఏంజెలెస్‌ 2028 నిర్వాహక కమిటీ క్రీడా డైరక్టర్‌ నికోలా కాంప్రియాని.. కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌పై కోహ్లి ప్రభావం, అతడి స్థాయి చెప్పడానికి ఇది సరిపోతుందంటే అతియోశక్తి కాదు.

”నా ఫ్రెండ్ కోహ్లీకి సోషల్ మీడియాలో 34 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అత్యధిక మంది ఫాలో అయ్యే మూడో ప్రపంచ అథ్లెట్‌ అతడు. లెబ్రాన్‌ జేమ్స్‌ (NBA స్టార్‌), టామ్‌ బ్రాడీ (అమెరికా ఫుట్‌బాల్‌ దిగ్గజం), టైగర్‌ వుడ్స్‌ (అమెరికా గోల్ఫ్‌ దిగ్గజం)లను ఫాలో అయ్యేవారి అందరినీ కలిపినా కోహ్లి కంటే తక్కువే. ఇది LA28, ఐఓసీ, క్రికెట్‌ సమాజం గెలిచిన సందర్భం. ప్రపంచ వేదికపై క్రికెట్‌కు మరింత చోటు దక్కనుంది. సంప్రదాయ క్రికెట్‌ దేశాలను దాటి ఇది విస్తృతమవుతుంది. దీన్ని అథ్లెట్లు, అభిమానులు ఆస్వాదిస్తారు” అని డైరెక్టర్‌ నికోలో కాంప్రియాని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నెట్టింట్లో కోహ్లి గురించి పెద్దఎత్తున చర్చ సాగుతోంది. ప్రస్తుత తరంలో కోహ్లిని మించిన ఆటగాడు లేడని, అతడి ఆటపై చర్చ అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links