464
నటి సన్నీలియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తన పనిమనిషి కుమారై అనుష్క కనిపించకపోవడంతో తాను తీసుకొన్న చొరవపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సన్నీలియోన్ మీద రెస్పెక్ట్ మరింత పెరిగిందంని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పనిమనషి కుమారై అనుష్క నవంబర్ 8న సాయంత్రం మిస్ అయ్యింది. దీంతో వెతకడంలో సాయం చేయాలని కోరుతూ సన్నీ లియోన్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. అంతేగాక ఆమెను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.50 వేలు గిఫ్ట్‌గా ఇస్తానని రివార్డు ప్రకటించింది. పాప పేరేంట్స్ ఆవేదనను చూస్తుంటే తనకెంతో బాధగా ఉందని చెబుతూ, ముంబయి పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్‌ను బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా షేర్ చేశారు. మొత్తంగా పాప ఆచూకీ దొరికిందని సన్నీలియోన్ గురువారం రాత్రి మరో పోస్ట్ పెట్టింది.