dekock
Home » South Africa vs Bangladesh- డికాక్‌, క్లాసెన్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా 382/5

South Africa vs Bangladesh- డికాక్‌, క్లాసెన్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా 382/5

by admin
0 comment

వాంఖడేలో పరుగుల సునామి! మరోసారి దక్షిణాఫ్రికా పరుగుల వరద పారించింది. ఇంగ్లాండ్‌పై చేసిన విధ్వంసాన్ని మరవకముందే బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్‌ (174) భారీ శతకం సాధించగా,హెన్రిచ్‌ క్లాసెన్‌ (90) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖర్లో మిల్లర్‌ (34*) కూడా సిక్సర్ల మోత మోగించడంతో మరోసారి భారీస్కోరు సాధించింది. వాంఖడే వేదికగా శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీసేన 399 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇవాళ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హెండ్రిక్స్‌ (12), డసెన్‌ (1) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ మార్క్రమ్‌ (60)తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. అయితే మార్క్రమ్‌ ఔటైనా తర్వాత మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. డికాక్‌, క్లాసెన్‌ బౌండరీల మోత మోగించారు. వీరిద్దరు 87 బంతుల్లో 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తన కెరీర్‌లో 150 వన్డే ఆడుతున్న డికాక్‌ 101 బంతుల్లో శతకం సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో అతడికిది మూడో సెంచరీ. తర్వాత గేర్‌ను మార్చిన డికాక్‌ 129 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. అయితే అతడు భారీ షాట్‌కు యత్నించి డబుల్ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

మరోవైపు క్లాసెన్‌ సిక్సర్లతో బంగ్లాకు చుక్కలు చూపించాడు. 34 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన అతడు తర్వాత మరింత చెలరేగాడు. అయితే ఆఖరి ఓవర్లో ఔట్వడంతో సెంచరీ మిస్ అయ్యాడు. దక్షిణాఫ్రికా ఆఖరి 10 ఓవర్లలో 144 పరుగులు చేయడం విశేషం.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links