cm kcr
Home » సింగరేణి కార్మికులకు బోనస్‌ రూ.1000 కోట్లు: CM KCR

సింగరేణి కార్మికులకు బోనస్‌ రూ.1000 కోట్లు: CM KCR

by admin
0 comment

అనతికాలంలోనే తిరుగులేని విజయాలు సాధించిన తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించే దేశమంతటా చర్చ జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉదయం గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పచ్చని పొలాలతో రాష్ట్రం కళకళలాడుతోందని, కాళేశ్వరం జీవధారలతో సస్యశ్యామలం అవుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అవరోధం తొలగిపోయిందని, అనుమతులు లభించాయని తెలిపారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. తెలంగాణ ఆచరిస్తుంటే, దేశం అనుసరిస్తోందనే ఖ్యాతిని పొందామని పేర్కొన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వివరించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ సహాయ చర్యలకు రూ.500 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రెండు దశల్లో సుమారు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. చేనేత కార్మికుల కోసం మరో నూతన పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బిల్లు ఆమోదంతో ఆ ఉద్యోగుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని అన్నారు. అయితే ఆ బిల్లును అడ్డుకునేందుకు కొన్ని సంకుచిత శక్తులు యత్నించాయని పేర్కొన్నారు.

త్వరలోనే కొత్త పీఆర్సీ నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామని సీఎం కేసీర్‌ వెల్లడించారు. అప్పటి వరకు మధ్యంతర భృతి చెల్లిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌గా రూ.1000 కోట్లు అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే 3-4 ఏళ్లలో మెట్రో రైల్‌ విస్తరణ పూర్తిచేయాలని నిర్ణయించామని, కొత్త ప్రతిపాదనలతో 415 కి.మీ. మెట్రో సౌకర్యం రానుందని వివరించారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links