226
న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి భారత్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. విజయంలో పేసర్ మహ్మద్ షమి కీలకపాత్ర పోషించాడు. ఏడు వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనే వన్డేల్లో ఓ భారత్ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన. అలాగే వన్డేలో ఏడు వికెట్లు సాధించిన తొలి టీమిండియా బౌలర్‌గా షమి నిలిచాడు. ఇక ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో అయిదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించడం షమికి ఇది నాలుగోసారి. అయితే కివీస్ పై అయిదు వికెట్లు తీసిన అనంతరం షమి .. బంతితో తలపై మసాజ్ చేస్తున్నట్టుగా.. డిఫ్రెంట్గా సెలబ్రేట్ చేశాడు. గతంలో కూడా ఇదే తరహాలోనే సంబరాలు చేశాడు. అయితే ఈ సెలబ్రేషన్స్‌కు కారణం.. టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేనే. పరాస్‌కు హెయిర్ లేకపోవడంతో షమి ఇలా ఫన్నీగా.. అతడిని ట్రోల్ చేస్తూ సెలబ్రేట్ చేస్తాడని గిల్ వివరించాడు.