256
సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ తమ దూకుడు కొనసాగించారు. సంచలన ప్రదర్శనతో కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ సాధించారు. ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఇండోనేషియా జోడీ అర్ఫియాన్-అర్డినాంటోపై 17-21, 21-13, 21-14తో గెలిచారు. తొలి సెట్లో ఓటమిపాలైనప్పటికీ, రెండో సెట్లో ప్రత్యర్థిని చిత్తుచేశారు. అదే తెగింపుతో ఆఖరి సెట్లోనూ సత్తాచాటి టైటిల్‌ను అందుకున్నారు. ఈ ఏడాది ఇండోనేసియా 1000 సూపర్ సిరీస్ టోర్నీతో పాటు స్విస్ ఓపెన్ 500 టైటిల్‌ను కూడా సాత్విక్ ద్వయం ఖాతాలో వేసుకుంది.