468
పొదల్లో దొరికిన పిల్లికూనను ఓ రష్యా మహిళ చేరదీసింది. తన పెంపుడు కుక్కతో పాటు పెంచింది. అయితే అది పెద్దయ్యే క్రమంలో అసలు ట్విస్ట్ తెలిసింది. అది పిల్లికూన కాదు బ్లాక్ పాంథర్. దీంతో షాక్ అయిన ఆమె ధైర్యం చేసి.. తనతోపాటే ఉంచుకొని అనుబంధం పెంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. బ్లాక్ పాంథర్ దొరికిన స్థితి నుంచి అది పెరిగి పెద్దదయి ఆడుకుంటున్న వరకు వీడియోలో ఉంది. కాగా ఆ వీడియోకు తెగ లైక్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 35 లక్షల మంది అనుసరిస్తున్నారు.