285
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రమంతటా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో మూడు రోజుల పాటు కొన్నిజిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్నగర్తో పాటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.