ntr
Home » 2000 మందితో ఎన్టీఆర్‌ డ్యాన్స్‌..ఫ్యాన్స్‌కు పూనకాలే

2000 మందితో ఎన్టీఆర్‌ డ్యాన్స్‌..ఫ్యాన్స్‌కు పూనకాలే

by admin
0 comment

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ సమర్పిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్‌ దాదాపు రెండు వేల మంది డ్యాన్సర్లతో ఓ సాంగ్‌ షూట్ చేయనున్నాడు. అనిరుధ్‌ అందిస్తున్న ఈ గ్రాండ్‌ సాంగ్‌కు ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రాఫర్‌. ఆర్‌ఆర్‌ఆర్‌లో నాటు నాటు పాటకు ప్రేమ్‌ రక్షిత్ మాస్టరే కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌-అనిరుధ్‌-ప్రేమరక్షిత్‌-2వేల మంది డ్యాన్సర్ల కాంబోలో సాంగ్‌ అంటే.. ఇక థియేటర్లో ఫ్యాన్స్‌ పూనకాలే.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links