327
వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సాధించింది. ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ సాధించిన అనంతరం ఆసీస్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. అయితే మిచెల్ మార్ష్ సోఫాలో కూర్చోని తన రెండు కాళ్లను.. ప్రపంచకప్ ట్రోఫీపైన పెడుతూ ఫొటోకు ఫోజు ఇచ్చాడు. ఈ ఫొటోనూ ఆసీస్ జట్టు కెప్టెన్ కమిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్‌ను ముద్దాడాలనేది ప్రతి దేశ ప్లేయర్ కల అని.. అలాంటి ట్రోఫీని అవమానించడం ఆసీస్ ప్లేయర్ల అహంకారానికి నిదర్శనం అని నెటిజన్లు మండిపడుతున్నారు. 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకునే సమయంలోనూ ఆసీస్ జట్టు.. బీసీసీఐ ప్రెసిండెట్‌తో అమర్యాదగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.