వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తోంది హీరోయిన్ శ్రీలీల. ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు టాప్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే తన కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది శ్రీలీల. మస్ట్‌గా తనకు కాబోయే వాడిలో త్రీ క్వాలిటీస్ ఉండాలంది. “మొదటి క్వాలిటీ ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి చాలా గట్స్ కావాలి. ఎందుకంటే నా లిస్ట్ చాలా పెద్దది. రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే, అతడికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఇక మూడో క్వాలిటీ.. నాకు కాబోయే భర్త కాస్త ఫ్యామిలీ టైపులో అందంగా, పద్ధతిగా ఉండాలి” అని వివరించింది శ్రీలీల. కాగా, వైష్ణవ్ తేజ్‌తో కలిసి శ్రీలీల నటించిన ‘ఆదికేశవ’ నవంబర్ 24న విడుదల కానుంది. ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడు. ఇక శ్రీలీల ప్రస్తుతం ‘ఆదికేశవ’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాల్లో నటిస్తోంది.
232
previous post