సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ మాస్ యాక్షన్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. మంగళవారం త్రివిక్రమ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘‘సర్రు మండుతాది బాబు గొడ్డు కారం.. గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం’’ అంటూ సినిమాలో మహేశ్‌బాబు క్యారెక్టర్‌ను డిస్క్రెబ్ చేస్తూ ఈ సాంగ్ ఉంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఇది ట్రెండింగ్ వీడియోగా నిలిచింది. తమన్ మ్యూజిక్ అందించగా, రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ రాశారు. సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. అయితే ర్యాప్ వెర్షన్‌కు త్రివిక్రమ్ సాహిత్యం అందించినట్లు తెలుస్తోంది. ఈ స్పైసీ ర్యాప్ వెర్షన్ సోషల్‌మీడియాను హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
404
previous post