1.7K
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. భారాస శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. అయితే డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో వాహనంపై ఉన్న కేటీఆర్, ఎంపీ సురేశ్‌రెడ్డి, జీవన్ రెడ్డి ముందుకు తూలారు. రెయిలింగ్ ఊడిపోవడంతో వాహనం మీద ఉన్నవాళ్లు ఒక్కసారిగా ముందుకు తూలారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతరం దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందవద్దు అని అన్నారు. జీవన్‌రెడ్డి నామినేషన్ ముగిసిన అనంతరం కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరారు.