వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ‘పిచ్మార్పు’గురించి బీసీసీఐపై మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. పిచ్ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, పిచ్ చాలా బాగుందని కేన్ చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా ఆడిందని కితాబిచ్చాడు. మరోవైపు ఐసీసీ.. సుదీర్ఘంగా సాగే మెగా టోర్నీలో పిచ్ మార్పు సర్వసాధారణమని వెల్లడించింది. ఇక మ్యాచ్ అనంతరం ‘పిచ్ మార్పుపై వస్తున్న విమర్శలపై’ దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ”టాస్ వేసిన తర్వాత పిచ్ ఏమీ మార్చలేదు. ఇన్నింగ్స్ ముగిశాక కూడా ఏమీ మార్చలేదు కదా! రెండు జట్లు ఒకే పిచ్‌పై ఆడాయి. ఇక రెండో సెమీఫైనల్ ఆడక ముందే ఫైనల్ జరిగే ‘అహ్మదాబాద్ పిచ్’ గురించి ఇప్పుడే మాట్లాడటం దారుణం” అని గావస్కర్ మండిపడ్డాడు.
366
previous post