jio
Home » Jio AirFiber -జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది.. ఆఫర్లు ఇవే

Jio AirFiber -జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది.. ఆఫర్లు ఇవే

by admin
0 comment

టెక్‌ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio AirFiber) వచ్చేసింది. ఇది ఎలాంటి కేబుల్స్‌, వైర్లు అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను ఆన్‌ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్‌ ద్వారా దగ్గర్లోని టవర్‌ నుంచి సిగ్నల్స్‌ అందుకొని ఇంటర్నెట్‌ను అందిస్తుంది. వాటి ప్లాన్లు 6 లేదా 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్నాయి. అయితే వీటికి ఇన్‌స్టలేషన్‌ ఛార్జీల కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ 12 నెలల ప్లాన్‌ తీసుకున్నవారికి ఇన్‌స్టలేషన్‌ ఛార్జీ నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దశలవారీగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు జియో తెలిపింది. 
ప్లాన్ల వివరాలు
రూ.599- 30Mbps, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా, సన్‌ నెక్ట్స్‌ తదితర ఓటీటీలు లభిస్తాయి.
రూ.899- 100Mbps, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా, సన్‌ నెక్ట్స్‌ తదితర ఓటీటీలు లభిస్తాయి.
రూ.1199- 100Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
జియో ఎయిర్‌ ఫైబర్‌ మ్యాక్స్‌ ప్లాన్స్‌..
రూ.1499- 300Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
రూ.2499- 500Mbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
రూ.3999- 1Gbps, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links