హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. HCA అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. HCA ఉపాధ్యక్షుడిగా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, (యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) గెలుపొందారు. ఉప్పల్ స్టేడియంలోని దయానంద్ లాంజ్‌లో శుక్రవారం నిర్వహించిన అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 173 మంది సభ్యులకు గాను 169 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో క్లబ్‌లు, ఇన్‌స్టిట్యూషన్ల నుంచి 149 మంది, జిల్లా సంఘాల నుంచి 9 మంది, అంతర్జాతీయ క్రికెటర్ల కోటాలో 15 మంది కలిపి మొత్తం 173 మందికి ఓటు వేసే హక్కు కల్పించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్‌తో పాటు వెంకటపతిరాజు, మిథాలీరాజ్, మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ బాధ్యతలు నిర్వర్తించారు.
418
previous post