ITR
Home » ITR: ఈ మెసేజ్‌ వస్తే జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక

ITR: ఈ మెసేజ్‌ వస్తే జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక

by admin
0 comment

ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. అయినప్పటికీ, అపరాధ రుసుముతో డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారు ఇ-వెరిఫై చేస్తే ఆదాయ పన్ను విభాగం ఆ రిటర్నులను ప్రాసెస్‌ చేస్తుంది. అర్హులైన వారికి రిఫండునూ అందిస్తుంది.

అయితే ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘మీ బ్యాంక్‌ ఖాతా నంబర్ తప్పుంది.. వెంటనే సరిచేసుకోండి, ఐటీ రిఫండ్ వచ్చింది.. లింక్‌పై క్లిక్‌ చేయండి’ అంటూ మెసేజ్‌లు పంపుతూ డబ్బు కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్ను దాఖలు చేసిన వారిని హెచ్చరిస్తూ ఓ ట్వీట్‌ చేసింది.

”ఆదాయపన్ను రిటర్నులు ఆమోదం పొందాయంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవన్నీ ఫేక్‌ మెసేజ్‌లు, ఆదాయ పన్ను శాఖ ఇలాంటి మెసేజ్‌లు ఎవ్వరికీ పంపదు. మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవటం కోసమే ఇలాంటి మెసేజ్‌లు పంపుతుంటారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి” అంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీట్‌ చేసింది.

మీకు రీఫండ్ ఇంకా రాలేదా?
సాధారణంగా, ఐటీ రిటర్న్‌ సబ్మిట్‌ చేసిన 7 రోజుల నుంచి 120 రోజుల లోపు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సదరు టాక్స్‌పేయర్‌కు రిఫండ్‌ చెల్లిస్తుంది. ఇప్పుడు రిఫండ్‌ టైమ్‌ బాగా తగ్గింది. అయితే కొంతమంది ఈ-వెరిఫై చేయకపోవడంతో రీఫండ్ ఆలస్యం అవుతుంటుంది. ఏ టాక్స్‌పేయర్‌ అయినా, రిటర్న్‌ ఫైల్‌ చేసిన తర్వాత దానిని కచ్చితంగా 30 రోజుల లోపు ఈ-వెరిఫై చేయాలి. అలా చేయకపోతే, ఐటీ రిటర్న్‌ సబ్మిట్‌ చేసినట్లుగా డిపార్ట్‌మెంట్‌ పరిగణించదు. అప్పుడు, ఆ ITR ప్రాసెస్ ప్రారంభం కాదు, రిఫండ్‌ రాదు. ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌ ప్రకారం, ఐటీఆర్‌ను ధృవీకరించిన వారికి మాత్రమే పన్ను వాపసు జారీ అవుతుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links