modi
Home » ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం- ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం- ప్రధాని మోదీ

by admin
0 comment

హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ఫోన్‌లో మోదీ చెప్పారు. ”ఇజ్రాయెల్‌ -హమాస్‌ మధ్య ఘర్షణలు, అక్కడి తాజా పరిస్థితుల గురించి నెతన్యాహు ఫోన్‌ చేసి తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు భారత్ అండగా నిలుస్తుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే, దాన్ని నిస్సందేహంగా, తీవ్రంగా ఖండిస్తాం” అని మోదీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయెల్‌పై ప్రయోగించారు. అంతేగాక సాయుధులైన డజన్లకొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఆ దేశంలోకి ప్రవేశించి మారణహోమం సృష్టించారు. మరోవైపు తమ దేశంలోకి చొరబడిన హమాస్‌ మిలిటెంట్లను తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు కొనసాగిస్తోంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links