target
Home » భారత్‌ 240.. ఇక బౌలర్లపైనే భారమంతా!

భారత్‌ 240.. ఇక బౌలర్లపైనే భారమంతా!

by admin
0 comment

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే వరల్ట్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా 50 ఓవర్లకు 240 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 66 పరుగులు, విరాట్ కోహ్లి 54 పరుగులు, రోహిత్ శర్మ 47 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌ పై ఆసీస్‌ బౌలర్ల భారత్‌ స్కోరును కట్టడి చేశారు. పుష్కర కాలం టైటిల్‌ కల నెరవేరాలంటే ఇక భారత్‌ బౌలర్లపైనే భారం.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు పేలవ ఆరంభం లభించింది. శుభ్‌మన్‌ గిల్‌ 4 పరుగులకే వెనుదిరిగాడు. అయితే రోహిత్, కోహ్లి కలిసి బౌండరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ ఎప్పటిలాగే సిక్సర్లు, బౌండరీల మోత మోగించాడు. కానీ హెడ్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో హిట్ మ్యాన్‌ వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ తో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. కానీ కోహ్లిని కమిన్స్‌ ఔట్‌ చేసి మరోసారి టీమిండియాను దెబ్బతీశాడు. ఆ తర్వాత టీమిండియా బ్యాటర్లు మరింత జాగ్రత్తగా ఆడారు. కానీ ఒత్తిడిలో వికెట్లను చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలో బౌండరీలతో హోరెత్తించిన టీమిండియా.. తర్వాత 11 నుంచి 40 ఓవర్ల మధ్యలో కేవలం రెండు బౌండరీలే సాధించింది. ఆసీస్‌ ఫీల్డర్లు గొప్పగా ఫీల్డింగ్‌ చేసి బౌండరీలు అడ్డుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లలో స్టార్క్‌ మూడు వికెట్లు, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఆసీస్‌కు భారత్‌ బౌలర్లు సవాలు చేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో బౌలింగ్‌ ఫేవరేట్‌ లక్నో పిచ్‌పై ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 229 పరుగులే చేసి 100 పరుగుల తేడాతో గెలిచింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links