త్రిషపై అశ్లీల వ్యాఖ్యలు చేయలేదని, అభినందించి గొప్పగా మాట్లాడానని.. అందువల్లే తాను సారీ చెప్పనని తమిళ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ అన్నాడు. ఇటీవల మన్సూర్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘‘గతంలో రేప్ సీన్లలో నటించా. ‘లియో’లో త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందనుకున్నా. కానీ, లేకపోవడంతో బాధగా అనిపించింది’’ అని మన్సూర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై నటీనటులు, మహిళా సంఘలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు నడిగర్ సంఘం మన్సూర్ను తాత్కాలికంగా నిషేధించింది. దీనిపై మన్సూర్ మాట్లాడుతూ.. ”త్రిష గురించి తప్పుగా మాట్లాడలేదు. అభినందించే, గొప్పగా మాట్లాడా. త్రిషనే నాకు థ్యాంక్స్ చెప్పాలి, సినిమాల్లో రేప్ సీన్లలో నటించేవారు.. నిజంగా చేస్తారని అర్థమా? ఈ విషయంలో నడిగర్ సంఘం వివరణ కోరకుండా ప్రకటన జారీ చేయడం దారుణం. ఎవర్నీ క్షమాపణలు కోరను” అని మాన్సూర్ వివరించాడు.
511
previous post