Rape
Home » Meerpet అత్యాచార ఘటన.. నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశం

Meerpet అత్యాచార ఘటన.. నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశం

by admin
0 comment

గంజాయి మత్తులో కత్తితో బెదిరించి 16 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా ఈ దారుణంపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ చౌహాన్ కి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు మీర్‌పేట్‌ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ మీడియాకు తెలిపారు. బాధితురాలు స్టేట్‌మెంట్‌ ప్రకారం ముగ్గురు అత్యాచారం చేసినట్లుగా కేసును నమోదు చేశామని అన్నారు. నిందుతులను పట్టుకునేందుకు సీనియర్‌ అధికారులచే ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. గంజాయి వినియోగం గురించి స్పందిస్తూ.. గంజాయి అరికట్టడంలో రాచకొండ పోలీసులు చురుకుగా ఉంటారని తెలిపారు. కట్టడి చర్యలో భాగంగా ఇప్పటికీ రోజుకు కనీసం ఒక కేసు అయినా నమోదు అవుతున్నట్లు చెప్పారు.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని లాల్‌బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో 15 రోజుల క్రితం తన సోదరుడి(14)తో కలిసి మీర్‌పేటలోని నందనవనం కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పనిచేస్తుంటాడు. సోమవారం ఉదయం 9 గంటలకు ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా మైనర్ ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టి భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు దారుణానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links