isro
Home » Ragging: ఇస్రోను సాయం కోరిన గవర్నర్‌

Ragging: ఇస్రోను సాయం కోరిన గవర్నర్‌

by admin
0 comment

ర్యాంగింగ్‌ (Ragging)ను నియంత్రించేందుకు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ ఇస్రోను సాయం కోరారు. ఈ మేరకు ఇస్రో (ISRO)కు లేఖ రాశారు. ర్యాంగింగ్‌ వల్ల విద్యార్థులు మరణిస్తున్న నేపథ్యంలో సాంకేతిక సహాయం అడిగారు. కొద్దిరోజుల క్రితం ఆ రాష్ట్రంలో జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో స్వప్నదీప్‌ అనే డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మరణానికి సీనియర్ల వేధింపులే కారణమని పోలీసులు తేల్చారు. ఈ సంఘటనపై యూనివర్శిటీ ఛాన్స్‌లర్ అయిన ఆనంద్‌ బోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన అడ్రిన్‌ సంస్థతోనూ గవర్నర్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజ్‌భవన్‌ తెలిపింది. ఈ సంస్థతో వీడియో అనలిటిక్స్‌, ఇమేజ్‌ మ్యాచింగ్‌, ఆటోమేటిక్‌ టార్గెట్‌ రికగ్నిషన్‌, రిమోట్ సెన్సింగ్‌ క్యాపబిలిటీ ఫీచర్లతో సాంకేతికతను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. ఇవి ర్యాగింగ్‌ నియంత్రణకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

జాబిల్లిపై రోవర్‌ దిగిన వీడియో వైరల్‌
చంద్రయాన్‌ దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్‌ ల్యాండర్‌ ల్యాండింగ్‌ చేసిన ప్రక్రియను ట్విటర్‌లో ఇస్రో పంచుకుంది. దాంతో పాటు జాబిల్లిపై అడుగులుపెట్టిన రోవర్‌ ప్రగ్యాన్‌కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links