213
ఆర్టీసీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళసై నుంచి ఇంకా అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నకు పంపి రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా అనుమతి లభించలేదు. దీంతో తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆ సంస్థలో పనిచేస్తున్న 43,373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
అయితే దీనికి సంబంధించిన బిల్లును శాసన సభ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల్లో ముగించాలని సర్కార్ చూస్తోంది. కానీ, గవర్నర్ నుంచి ఇంకా అనుమతి లభించకపోవడంతో బిల్లుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.