gambhir-kohli
Home » INDvPAK: ఆ అవార్డు కోహ్లికి దక్కాల్సింది కాదు- గంభీర్‌

INDvPAK: ఆ అవార్డు కోహ్లికి దక్కాల్సింది కాదు- గంభీర్‌

by admin
0 comment

ఆసియాకప్‌ (AsiaCup2023)లోని భారత్‌-పాకిస్థాన్‌ (INDvPAK) మ్యాచ్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ దక్కింది. అయితే ఆ అవార్డు కోహ్లికి బదులుగా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు దక్కాల్సిందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అభిప్రాయపడ్డాడు. విరాట్, కేఎల్‌ రాహుల్‌ సెంచరీలు సాధించారని, అయితే కొలంబో పిచ్‌పై 8 ఓవర్లలోనే 5 వికెట్లు పడగొట్టడం గొప్ప ఘనత అని కుల్‌దీప్‌ను కొనియాడాడు. పేసర్లతో పాటు వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌గా కుల్‌దీప్‌ జట్టులో ఉండటం టీమిండియాకు గొప్ప సానుకూలతని చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం ఆటను విశ్లేషిస్తూ గంభీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 94 బంతుల్లో 122 పరుగులు, రాహుల్‌ 106 బంతుల్లో 111 పరుగులు సాధించారు. దీంతో టీమిండియా 356/2 స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్థిజట్టు తడబడింది. 128 పరుగులకే కుప్పకూలింది. కుల్‌దీప్‌ 5 వికెట్లు, హార్దిక్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links