టోర్నీలో సత్తాచాటిన ప్లేయర్లును ఐసీసీ ఒక జట్టుగా సెలక్ట్ చేసి.. ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించింది. ఆ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మను ఎంపిక చేసింది. అంతేగాక ‘ఐసీసీ జట్టు’లో రోహిత్‌తో కలిపి టీమిండియా ప్లేయర్లు ఆరుగురు ఉండటం విశేషం. టోర్నీలో రికార్డు పరుగులు సాధించిన విరాట్ కోహ్లి, నిలకడగా రన్స్ చేసిన కేఎల్ రాహుల్, ఉత్తమ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా, బౌలింగ్‌లో మంచి ఎకానమీ రేటు సాధించిన బుమ్రా, వికెట్ల వేటతో బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించిన షమిని సెలక్ట్ చేసింది. వారితో పాటు దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్, న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్, శ్రీలంక పేసర్ మధుశంక, ఇక ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నుంచి.. హిట్టర్ మాక్స్‌వెల్, స్పిన్నర్ జంపాను ఎంపిక చేసింది. 12 వ ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా యువపేసర్ కొయెట్జిని ప్రకటించింది.
277