Journalism
Home » తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తప్పని తిప్పలు

తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తప్పని తిప్పలు

by admin
0 comment

తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తిప్పలు తప్పట్లేదు. సామాన్య ప్రజల్ని మభ్య పెట్టినట్లే జర్నలిస్టుల్ని కూడా ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వాటిని మాత్రం నెరవేర్చట్లేదు. అధికారంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణలో 2018 ముందస్తు ఎన్నికల సమయంలో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న కేటీఆర్… తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిచ్చేస్తామన్నారు. అప్పటికీ ఆయన ఐదేళ్లుగా అధికారంలోనే ఉన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉందని కారణం చూపారు. కేసీఆర్ కూడా అదే చెప్పారు. ప్రత్యేకంగా న్యాయనిపుణుల్ని పెట్టి కేసు గెలుస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏమీ చేయలేదు. చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఎన్వీరమణ కేసును క్లియర్ చేశారు. అయినా అదే దుస్థితి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లోనూ అంతే. వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయింది. జర్నలిస్టుల్ని వర్గ శత్రువులుగా ప్రకటించుకుని రాజకీయం చేస్తోంది వైసీపీ. అక్రిడేషన్లు కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఇప్పుడు జర్నలిస్టులకు మూడు సెంట్లు ఇస్తామంటూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సాక్షి నుంచి ప్రభుత్వం పే రోల్స్ లోకి మారిన కొంత మంది ఆయనను కలిసి కృతజ్ఞతలు కూడా తెలిపారు. వారికైనా ఇస్తారో లేదో కానీ.. ఏపీ కేబినెట్ తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం సక్రమంగా అమలైన దాఖలాల్లేవు. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో ఓ జర్నలిస్ట్ సొసైటీ ఏర్పడింది. భూమి కూడా కేటాయించారు. కానీ జగన్‌ ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేసారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇళ్ల స్థలాలని ఆశ పెడుతున్నారు. అంతేగాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ అనుకూలంగా ఉన్నవారికే ప్రయోజనాలు ఇవ్వాలని చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలైన జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links