lawarance
Home » chandramukhi 2: రాజసంగా లారెన్స్‌

chandramukhi 2: రాజసంగా లారెన్స్‌

by admin
0 comment

కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ గమనిస్తే… రాజు వేషంలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నాడు. ఆ లుక్ లో పొగరు, రాజసంతో పాటు కూర్ర‌త్వం కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.

2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రానుంది. ఈ సినిమాను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ విషయాన్ని పోస్టర్ లో వెల్లడించారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు. నిజానికి ఈ సీక్వెల్ లో నటిస్తున్నాడని తెలియగానే, లారెన్స్ పై రజనీకాంత్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఆ వెంటనే లారెన్స్, ప్రత్యేకంగా రజనీకాంత్ ఇంటికి వెళ్లాడు. ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కూల్ అయ్యారు. అటు లైకా ప్రొడక్షన్స్ కూడా రజనీకాంత్ నుంచి పూర్తి అంగీకారం పొందిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ చేసింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links