278
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు.. చంద్రమోహన్‌కు కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం పంజాగుట్టలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. చంద్రమోహన్ సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరిరావు, మాదాల రవి, పలువురు సినీ ప్రముఖులు భావోద్వేగానికి లోనై చంద్రమోహన్‌కు నివాళులర్పించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేసిన చంద్రమోహన్.. హీరోగానే కాకుండా కమెడియన్, సహాయనటుడిగానూ విభిన్న పాత్రలు పోషించారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.