248
ఎనర్జిటిక్ హీరో రామ్- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘స్కంద’. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే నెటిజన్లు ఓటీటీలో ఈ సినిమాలోని ఒక్కో సీన్‌ను తీక్షణంగా పరిశీలిస్తూ కొన్నికొన్ని అంశాలను కనిపెడుతున్నారు. ప్రస్తుతం ఆ సీన్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. క్లైమాక్స్ ఫైట్లో హీరో రామ్ దీపస్తంభాలు తీసుకుని విలన్ల మీద ఎటాక్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. దాన్ని మామూలుగా చూస్తే మనకు ఏం తేడాగా అనిపించదు. కానీ స్లో మోషన్లో గమనిస్తే.. ఒక చోట రామ్ స్థానంలో బోయపాటి ఉన్నాడు. అచ్చం రామ్ లాగే డ్రెస్ వేసుకుని బోయపాటే ఆ షాట్ చేశారు. అయితే అది ఎడిటింగ్ మిస్టేకా లేకుంటే ఆ సమయానికి హీరో అందుబాటులో లేనందున అలా చేశారో తెలియదు.