255
బాలాపూర్ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం పాట ప్రారంభించింది. కాగా, బాలాపూర్ లడ్డూ వేలాన్ని ప్రారంభించి ఈ ఏడాదికి 30 ఏళ్లు కావస్తోంది. తొలిసారిగా 1994లో బాలాపూర్ లడ్డూను వేలం వేయగా.. స్థానిక రైతు మోహన్‌రెడ్డి రూ.450కు కైవసం చేసుకున్నారు. మరోవైపు బండ్లగూడ జాగీర్‌లో ఏకదంతుడి చేతిలోని లడ్డూ రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంలో లడ్డూ ఏకంగా రూ.1.26 కోట్లు పలికింది. విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి ఆ లడ్డూను సొంతం చేసుకుంది.