cbn
Home » Chandrababu Naidu- చంద్రబాబుకు బెయిల్‌.. హైకోర్టు షరతులు ఇవే

Chandrababu Naidu- చంద్రబాబుకు బెయిల్‌.. హైకోర్టు షరతులు ఇవే

by admin
0 comment

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ పూర్తిచేసిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. నాలుగు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నవంబర్‌ 10న హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. గత 52 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు.

నాలుగు వారాల పాటు కండీషన్స్‌తో మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఆ షరుతులు ఏంటంటే.. లక్షరూపాయల పూచీకత్తుతో ఇద్దరు ష్యూరిటీలను కోర్టుకు సమర్పించాలి. చంద్రబాబు తన సొంత ఖర్చులతో తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చు. ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారు? చికిత్స వివరాలు ఏంటీ? అనేది సీల్డ్ కవర్‌లో చంద్రబాబు సరెండర్ అయిన టైంలో రాజమండ్రి జైలు సూపరింటెడెంట్‌కు సమర్పించాలి. ఆ సీల్డ్ కవర్‌ను యథాతథంగా ట్రయిల్‌ కోర్టుకు సమర్పించాలి. కేసుపై ప్రభావం చూపే పనులు చేయరాదు. కేసుపై ఎఫెక్ట్ పడేలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బెదిరించడం, హామీలు ఇవ్వడం కానీ చేయకూడదు. నవంబర్‌ 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి జైలు సూపరింటెడెంట్‌ ముందు సరెండర్ అవ్వాలి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links