ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. పసికూన అఫ్గానిస్థాన్ చేతిలోనూ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఇక సెమీస్ రేసులో అదృష్టంపై ఆధారపడింది. అయితే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పర్సనల్ చాట్ లీక్ అవ్వడం పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంది. పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్‌తో బాబర్ మాట్లాడానికి ప్రయత్నిస్తున్నాడని, కానీ చీఫ్ నుంచి స్పందన రాలేదంటూ వస్తున్న నేపథ్యంలో బాబర్ వాట్సాప్ చాట్ లీకైంది. ”పీసీబీ చైర్మన్‌కు కాల్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటూ కథనాలు వస్తున్నాయి. ఏమైనా ట్రై చేశావా?” అంటూ సల్మాన్ అనే వ్యక్తి బాబర్‌కు మెసేజ్ చేశాడు. దానికి బాబర్ చేయలేదని బదులిచ్చాడు. అయితే బాబర్ పర్సనల్ చాట్‌ను మీడియాకు లీక్ చేయడమేంటని పాక్ మాజీ క్రికెటర్ వకర్ యూనిస్ మండిపడ్డాడు. పాక్ క్రికెట్‌కు బాబర్ గొప్ప ఆస్తి అని, అతడిని వివాదాల్లోకి లాగకండి అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
227
previous post