ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. గాయాలతో గత కొంత కాలంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. సీనియర్లు అయిన వారిద్దరు రాకతో టీమిండియా మిడిలార్డర్ బలోపేతం కానుంది. మరోవైపు ఐర్లాండ్ సిరీస్‌తో పునరాగమనం చేసిన బుమ్రా పేస్ దళాన్ని నడిపించనున్నాడు. వెస్టిండీస్ సిరీస్‌లో సత్తాచాటిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా జట్టులో చోటు సంపాదించాడు.
యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్‌కు అవకాశం ఇచ్చారు. రోహిత్ సారథ్యంలో 17 మందిని అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌కు నిరాశే ఎదురైంది. అతడికి చోటు దక్కలేదు. మరోవైపు వికెట్‌కీపర్ సంజు శాంసన్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా తెలిపారు. ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.
జట్టు వివరాలు:
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ప్రసిధ్ కృష్ణ
బ్యాకప్ ప్లేయర్: సంజు శాంసన్