బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుక్సింగ్స్‌లో ఈ సినిమా హవా చూపిస్తోంది. ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఢిల్లీలోని పీవీఆర్ డైరక్టర్స్ కట్ స్క్రీన్ లో రీ-క్లయినర్ టికెట్ ధర 2400 రూపాయలు. యానిమల్ సినిమాకు సంబంధించి దేశంలో గరిష్ఠ టికెట్ ధర ఇదే. నార్త్ లోని కీలకమైన పట్టణాల్లోని మల్టీప్లెక్సుల్లో 500 రూపాయలకు తగ్గకుండా టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. ఇక ముంబయిలోని మల్టీప్లెక్స్‌లో మినిమమ్ 550 రూపాయలు. అయితే ముంబయిలో గరిష్ఠ ధర 2200 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో యానిమల్ సినిమా టికెట్ రేట్లు సాధారణంగానే ఉన్నాయి. అయితే మూవీ రిలీజైన వారం రోజుల తర్వాత టికెట్ ధరలు తగ్గుతాయి.
1.6K
previous post