మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మెక్సికో (Mexico) పార్లమెంట్‌లో ప్రదర్శించారు. ఇవి మనుషలవనీ, లేదా జంతువులవనీ చెప్పడానికి వీలులేని కొన్ని అవశేషాలు. వీటిని గ్రహాంతరవాసులవని (Alien corpses) వారు చెబుతున్నారు. దీనిపై మొదటిసారి బహిరంగ విచారణ జరిగింది. 2017లో పెరూలో లభించిన ఈ రెండు అవశేషాలు 700 నుంచి 1800 ఏళ్ల పురాతనమైనవనిగా చెబుతున్నారు. వాటి చేతులకు మూడు పొడవాటి వేళ్లు కనిపిస్తున్నాయి. వాటి తలలు పొడవుగా అండాకారంలో ఉన్నాయి. అయితే ఈ అంశంపై ఏ శాస్త్రీయ సంస్థలైనా పరిశోధనలు చేయవచ్చని ఆ దేశ ప్రతినిధులు వెల్లడించారు. ఇది ఎన్నో అన్వేషణలకు ప్రారంభమని అన్నారు.
మరోవైపు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (Nasa) దీనిపై స్పందించింది. వాస్తవంగా అవి ఏంటో స్పష్టత లేదని, అయితే ఈ విషయంలో పారదర్శకత ముఖ్యమని పేర్కొంది. ఏదైనా వింతగా అనిపించినప్పుడు, వాటిని శాస్త్రీయ నిపుణుల ముందుకు తీసుకెళ్లాలని మెక్సికో ప్రభుత్వాన్ని ఉద్దేశించి వెల్లడించింది.