crime
Home » crime: మద్యం మత్తులో యువతిని వివస్త్రను చేసి..

crime: మద్యం మత్తులో యువతిని వివస్త్రను చేసి..

by admin
0 comment

మద్యం మత్తులో ఓ యువకుడు మహాదారుణానికి ఒడిగట్టాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి నడిరోడుపై వివస్త్రను చేశాడు. ఈ అమానవీయ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య ఆదివారం రాత్రి పీకల్లోతు తాగాడు. అనంతరం తన తల్లితో కలిసి బాలజీనగర్‌ బస్టాండ్‌ నుంచి ఇంటికి పయనమయ్యాడు. అయితే ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న స్థానిక యువతితో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమెపై దాడి చేసి వివస్త్రను చేశాడు.

అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ ఈ దారుణాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించింది. ఆ సదరు మహిళపై కూడా అతడు దాడికి యత్నించాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ యువతి నగ్నంగా రోడ్డుపైనే ఏడుస్తూ కూర్చున్నా.. చుట్టుపక్కల వారి నుంచి స్పందన కూడా రాలేదు. అయితే అతడు వెళ్లాక కొందరు వచ్చి ఆమెను కవర్లతో కప్పారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links