394
పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేడిగాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రామగుండంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు చెప్పింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.3 డిగ్రీలు, నల్లగొండలో 42, మెదక్ 41, నిజామాబాద్‌లో 40.8, రామగుండంలో 40.6, హనుమకొండలో 39.5, హైదరాబాద్ 38.7, భద్రాచలంలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.