261
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగుళ్ల కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఏసీబీ కోర్టు, సీఐడీ కస్టడీని కూడా తిరస్కరించింది. కాగా, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. ఫైబర్ నెట్ కేసులో ఏ25గా ఉన్నారు.