Key changes in Secunderabad-Tirupati Vande Bharat train
Home » సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలులో కీలక మార్పులు

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలులో కీలక మార్పులు

by admin
0 comment

సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ విషయంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కోచ్ లను డబుల్ చేసింది . రైల్వే శాఖ ప్రస్తుతం ఉన్న 8 కోచ్ లకు మరో 8 కోచ్ లు యాడ్ చేసింది . సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది . వందే భారత్ రైలుకు మంచి స్పందన రావడంతో అధికారులు బోగీలు రెట్టింపు చేశారు .

దక్షిణ మధ్య రైల్వే గతంలోనే బోర్డ్ అధికారులకు లేఖ రాశారు . ఈ లేఖకు స్పందించిన రైల్వే బోర్డు సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్ లను పెంచింది. మొదటి వందే భారత్ గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగా , గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించేలా ఈ వందేభారత్ రైలు రూపొందించబడింది.

ఇక ఈ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వారంలో మంగళవారం మినహా అన్ని రోజుల్లో నడుస్తుంది. సికింద్రాబాద్ లో ప్రారంభం అయ్యే ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రపదేశ్ లోని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

ఇక సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ టికెట్ ధర విషయానికి వస్తే, ఈ ట్రైన్ టికెట్ ధర జీఎస్టీ తో కలిపి 1150 రూపాయలు ప్రారంభ ధరగా నిర్ణయించారు . సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ టైమింగ్స్ ను ఒకసారి పరిశీలిస్తే, ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 6:00 లకు బయలుదేరి, 07.19 గంటలకు నల్గొండ , 09.45 గంటలకు గుంటూరు, 11.09 గంటలకు ఒంగోలు, 12.29 గంటలకు నెల్లూరు, ఇక మధ్యాహ్నం 02.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది .

ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 03.15 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 05.20 గంటలకు నెల్లూరు, 06.30 గంటలకు ఒంగోలు, రాత్రి 07.45 గంటలకు గుంటూరు, 10.10 గంటలకు నల్గొండ, 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి – 1680 రూపాయలుగాను , సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు 1270 రూపాయలు గాను , సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకు 1075 రూపాయల ధరగా నిర్ణయించారు ,సికింద్రాబాద్ నుంచి గుంటూరు 865 రూపాయలుగా నిర్ణయించారు రైల్వే అధికారులు . సికింద్రాబాద్‌ – తిరుపతి ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్ టికెట్ ఛార్జీలు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి కి 3080 రూపాయలు కాగా , సికింద్రాబాద్ నుంచి నెల్లూరు 2455 గా , సికింద్రాబాద్ నుంచి ఒంగోలు కు 2045 గానూ , సికింద్రాబాద్ నుంచి గుంటూరు కు 1620 రూపాయలుగా సికింద్రాబాద్ నుంచి నల్గొండ కు 900 గా నిర్ణయించారు .

గతంలో సాధారణ ట్రైన్ లలో ప్రయాణించిన ప్రయాణికులు వందేభారత్ ప్రవేశ పెట్టిన అనంతరం తమ ప్రయాణాన్ని సులువుగా కొనసాగిస్తున్నారు . గంటల వ్యవధిలోనే ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేరుస్తుండడంతో చాలా ట్రైన్ లలో రద్దీ నెలకొంది . దీన్ని దృష్టిలో పెట్టుకున్న దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ ట్రైన్ లలో బోగీలను పెంచుతూ ప్రయాణికులపై ఒత్తిడి తగ్గిస్తుంది . రద్దీ ఏ మాత్రం తగ్గకుంటే మరిన్ని భోగీలు పెంచినా నష్టం లేదని , టికెట్ ధరపై కూడా రైల్వే అధికారులు ఓసారి ద్రుష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు .

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links